- Step 1
ఒక గిన్నెలో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, గరం మసాల, కబాబ్ చిని పొడి వేసి బాగా కలపాలి. అందులో చికెన్ వేసి బాగా కలిపి అరగంట పాటు నానపెట్టాలి.
- Step 2
తర్వాత మిక్సీ గిన్నెలో బాదం పప్పులు, జీడిపప్పు, మిరియాలు, ఎండుకొబ్బరి రుబ్బుకోవాలి. ఇందులో పెరుగు, పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో అల్లంవెల్లుల్లిలో నానిన చికెన్ ని వేసి మరో పావుగంట నానపెట్టాలి.
- Step 3
ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, సరిపడా నూనె పోసి వేడెక్కాక చికెన్ తో పాటు మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేగించాలి. ఉప్పు, కారం, గరంమసాల వేసి ఓ పావుగంటసేపు ఉడికించాలి. ముక్క మెత్తపడ్డాక దించేసి కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.