- Step 1
ఓవెన్ ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేయాలి.
- Step 2
చికెన్ పైన ఉన్న తోలు, లోపల ఉన్న కొవ్వు తీసేయాలి. తరువాత శుభ్రముగా కడిగి పలుచని బట్టతో తడి లేకుండా అద్దాలి.
- Step 3
తాజా ఆకులన్నీ సన్నగా తరగాలి.
- Step 4
ఓ చిన్న గిన్నెలో ఆకుల తురుము, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె, కిచెన్ కింగ్, కారం వేసి కలపాలి.
- Step 5
కోడి పొట్ట లోపల నిమ్మచెక్క, వెల్లుల్లి రెబ్బలు, రోజ్ మేరి ఉంచాలి.
- Step 6
ఇవి తినడానికి కాదు కేవలం మంచి వాసనా కోసం మాత్రమే.
- Step 7
ఇప్పుడు తాజా ఆకుల తురుముని కోడికి అన్ని వైపులా పట్టించాలి.
- Step 8
ఛాతి దగ్గర చర్మం వదులుగా లాగి లోపల కూడా పట్టించాలి.
- Step 9
కాళ్ళని మందపాటి దారంతో కట్టేసి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో సుమారు గంట నుంచి గంటన్నర సేపు రోస్ట్ చేయాలి.
- Step 10
మధ్యమధ్యలో చికెన్ నుంచి కారిన జ్యూస్ ను అడ ఎండిపోకుండా చికెన్ కు పట్టిస్తూ ఉండాలి.
- Step 11
మొత్తం రోస్ట్ అయ్యాక దాన్ని అలాగే పదిహేను నిముషాలు ఉంచాలి. బయటకి తీసి పొట్టలోపల ఉంచినవన్నీ తీసేయాలి. ఇప్పుడు దీన్ని కావలసినట్లుగా ఏ భాగానికా భాగాన్ని విడతీసి వడ్డించాలి.