- Step 1
ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడుక్కొని, ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి.
- Step 2
మరుసటి రోజు పొద్దున్నే ఆ నీటిని వడకట్టి, నీరు పోయేదాకా ఒక గుడ్డమీద ఆరబెట్టుకోవాలి.
- Step 3
తడిలేని బియ్యాన్ని పొడి చేసుకొని జల్లడ పట్టుకోవాలి.
- Step 4
బెల్లం పొడికి కప్పు నీరు కలిపి స్టవ్ మీద పెట్టుకొని చిక్కటి పాకం వచ్చేదాకా కలపెట్టాలి.
- Step 5
ఇలా తయారైన బెల్లం పాకానికి, బియ్యం పిండి కొంచెం తిప్పుతూ బాగా కలిసి పోయేట్టు కలుపుకోవాలి.
- Step 6
పొయ్యి మీద నుండి దించుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి.
- Step 7
బాణలిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చేతి మీద ప్లాస్టిక్ పేపర్ లేదా అరిటాకు వేసుకొని, దానికి నూనె రాసుకోవాలి.
- Step 8
ఇప్పుడు ఒక్కొక్క ఉండా తీసుకొని కొన్ని నువ్వులు చల్లుకొని పూరిలాగా చిన్న మంట మీద నూనెలో వేపుకోవాలి.
- Step 9
ఒక్కోదాన్ని అట్లాకాడల మద్య నూనె బాగా పోయేట్టు నొక్కుతూ బయటకి తీయాలి.