- Step 1
డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు)
- Step 2
ఖర్జూరాలను బాగా సన్నగా కట్చేయాలి.
- Step 3
మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి.
- Step 4
ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి.
- Step 5
బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది.
- Step 6
ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి;
- Step 7
పటికబెల్లం జతచేయాలి;
- Step 8
ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి;
- Step 9
కిందకు దించి ఉండలు చేయాలి.