- Step 1
ఒక పాన్‌లో మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి, ఇందులో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి బాగా ఉండికించాలి.
- Step 2
కొద్దిసేపాగి మీల్‌మేకర్ వేసి ఎక్కువ మంటమీద 2 నుంచి మూడు నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 3
దింపేసి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాలపాటు పక్కన పెట్టి చూస్తే మీల్‌మేకర్ సైజు డబుల్ అవుతుంది.
- Step 4
ఇప్పుడు అందులోని నీటిని వంపి మీల్‌మేకర్ చేతిలోకి తీసుకుని నీళ్లు పోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
మరో గిన్నె తీసుకుని అందులో శనగపప్పు మృదువుగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇప్పుడు పక్కకు పెట్టిన మీల్‌మేకర్‌లో ఉడికించిన శనగపప్పు, పూదీన ఆకులు, అల్లం పేస్ట్, సోంపు, జీలకర్ర, పసుపు, కారం, నల్లమిరియాల పొడి, గరంమసాలా పొడి, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టాలి.
- Step 7
నీళ్లు అస్సలు పోయకూడదు. అదనంగా తీసుకున్న కోడిగడ్డును పగులకొట్టి సొన వేసి మళ్లీ మిక్సీ పట్టాలి.
- Step 8
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించిన కోడిగుడ్డు చుట్టూ ఫొటోలో చూపినవిధంగా పెట్టాలి.
- Step 9
తరువాత ఒకటినుంచి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టి తీశాక, ఒక గిన్నెలో నూనె పోసి బాగా వేడిచేయాలి.
- Step 10
మిశ్రమం దట్టించిన ఒక్కో కోడిగుడ్డును తీసుకుని నూనెలో వేయించాలి. నిమ్మ ముక్కలతో ఈ కబాబ్స్ సర్వ్ చేస్తే సూపర్!