- Step 1
బియ్యం, శనగపప్పు, మినపప్పులను కడిగి విడివిడిగా నానబెట్టాలి. తర్వాత రోజు పొద్దున్నే అన్నింట్లో నీటిని వడగట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి.
- Step 2
అందులో వాటితోపాటు అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, బఠాణీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మూతపెట్టి 7 నుంచి 8గంటల పాటు అలాగే ఉంచాలి.
- Step 4
ఆ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా, ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ మిశ్రమంలా కలుపుకోవాలి.
- Step 5
ధోక్లా ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని వేసి కుక్కర్‌లో ఆవిరి మీద ఉడికించాలి. పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
- Step 6
దాన్ని చిన్నగా మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించి ధోక్లాల మీద వేయాలి. కొబ్బరితురుముతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.