- Step 1
ముందుగా బౌల్ తీసుకొని అందులో గరం మసాలా, ధనియాలపొడి, కారం, మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
- Step 2
మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
- Step 3
ఇప్పుడు, ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో బట్టర్ వేయాలిన.
- Step 4
బట్టర్ కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే మటన్ కూడా వేసి ఫ్రై చేయాలి.
- Step 5
తర్వాత మసాలా వేసిమొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే ఉప్పు కూడా జోడించాలి.
- Step 7
తర్వాత నీరు సరిపడా పోయాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి మిక్స్ చేస్తూ గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి .
- Step 8
తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి మూత పెట్టి 5-6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి .
- Step 9
తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ కూల్ గా అయిన తర్వాత గ్రేవీని సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి.