- Step 1
ఒక పాత్రలో కాస్తంత ఛీజ్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పంచదార పొడి వేసి బాగా స్సూన్ తో కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
పాన్ లో మిగిలిన వెన్న వేసి కరిగాక పుదీనా, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. అందులోనే చికెన్ కీమా వేసి, మిగిలిన జీడిపప్పు పేస్ట్, తగినింత ఉప్పు వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి.
- Step 3
తర్వాత పై మిశ్రమంలోనే కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి సగం టొమోటో సాస్, కొత్తమీర, తగినంత ఉప్పువేసి బాగా కలిపి నీళ్లు పోసి కాస్త గ్రేవీ ఉండేలా ఉడికించి దింపుకోవాలి.
- Step 4
చివర్లో పిజ్జా బేస్ మీద, మొదట్టో తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని రాసి పైన చికెన్ కీమా కూరని సర్ధాలి. దీనిపైన కొత్తిమీర తురుము, చీజ్ తురుము కూడా చల్లి ఓవెన్ లో ఒక 5 నిమిషాలపాటు పెట్టి హీట్ అయిన తర్వాత తీసేయాలి. అంతే చికెన్ పిజ్జా రెడీ.