- Step 1
ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో షాజీరా, పుదీనా, ఉల్లిపాయ, కరివేపాకు, వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 2
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.
- Step 3
ఇందులో ముందుగానే పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బోన్ లెస్ చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిముషాలు మగ్గించాలి.
- Step 4
మగ్గిన చికెన్ లో ధనియాల పొడి, జీలకర్ర, చికెన్ మసాలా, కారం, ఉప్పు, వరుసగా వేస్తూ కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక 10 నిముషాల వరకూ కర్రీని ఉడికించుకోవాలి.
- Step 5
కర్రీ దగ్గర పడుతున్నప్పుడు, మూత తీసి కలియబెడుతుండాలి. 5 నిముషాల తర్వాత వేయించితే చికెన్ స్టఫింగ్ రెడీ అయినట్లే..
- Step 6
ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ లను సన్నగా తరిగి, నిమ్మరసం పిండి సలాడ్ లాగా రెడీ చేసి పెట్టాలి.
- Step 7
ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకొన్న చపాతీల మీద మయోనైజ్ అప్లై చేయాలి.
- Step 8
చపాతీ మొత్తం మయోజైజ్ అప్లై చేసిన తర్వాత చపాతీల మీద కూరగాయల ముక్కలు పెట్టాలి.
- Step 9
వీటి మీద ముందుగా తయారుచేసుకొన్న చికెన్ స్టఫ్ పెట్టాలి. అలాగే చికెన్ స్టఫ్ మీద తిరిగి వెజిటేబుల్ ముక్కలు వేసి స్టఫ్ చేయాలి.
- Step 10
చివరగా టమోటో సాస్ వేసి చపాతీని రోల్ చేస్తే సరి హోం మేడ్ చికెన్ రోల్ రెడీ.