- Step 1
పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి.
- Step 3
దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
- Step 4
నూనె పక్కకి వచ్చిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి.
- Step 5
ఇందులో మిక్సీలో వేసి పెట్టుకున్న పెరుగు పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి.
- Step 6
తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి.
- Step 7
తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి.
- Step 8
ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాలా పొడి వేసి కొత్తి మీరతో అలంకరించాలి.
- Step 9
మటర్ పనీర్ సర్వింగ్‌కి రెడీ.