- Step 1
ముందుగా బ్రెడ్ స్లైసుల అంచుల్ని కత్తిరించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
కొద్దిగా నీళ్ళు చల్లి ముద్దలా కలుపుకోవాలి.
- Step 3
అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి తరుగు, పన్నీర్ తరుగు, కొత్తిమీర తరుగు, మైదా, బియ్యప్పిండి, సరిపడా ఉప్పు వేసి నీళ్ళు చల్లుతూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
- Step 4
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అందులో వేయాలి.
- Step 5
ఎర్రగా వేగాక తీసేయాలి.
పొయ్యి మీద మరో బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి, కాగాక ముందుగా వేయించి పెట్టుకున్న మంచురియా ఉండలు, సోయాసాస్, వెనిగర్, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరికొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
- Step 6
రెండు లేక మూడు నిమిషాలయ్యాక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఈ మంచురియాను వేడివేడిగా టొమాటో సాస్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.