- Step 1
బెండకాయలను మంచిగా కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు కడాయిలో నూనెపోసి జీలకర్ర వేసి వేగనివ్వాలి.
- Step 3
ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపేస్టూ కలపాలి.
- Step 4
ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేగనిచ్చి బెండకాయ ముక్కలను వేయాలి.
- Step 5
సన్నని మంట మీద ఒక పావు గంటపాటు అలాగే ఉంచాలి.
- Step 6
ఆ తర్వాత దీంట్లో ముందుగా పసుపు, కారం వేసి కాసేపు కలపాలి.
- Step 7
ఆ పై గరం మసాలా పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి.
- Step 8
ఇలా వేగేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. వేడి.. వేడి.. భేండీ మసాలా మీ ముందుంటుంది. ఈ కూర చపాతీల్లోకి చాలా బాగుంటుంది.