- Step 1
రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి.
- Step 2
దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 3
ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి.
- Step 4
కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక పల్లీలు వేసి వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి.
- Step 5
దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.
- Step 6
కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి. ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేయాలి.
- Step 7
వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.