- Step 1
నువ్వుల్ని ముందుగా నూనె లేకుండా వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.
- Step 2
ఓ గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు, సేమియాకు సరిపడా ఉప్పు, రెండు చెంచాల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి.
- Step 3
అవి మరుగుతున్నపుడు సేమియా వేసేయాలి.
- Step 4
సేమియా మూడు వంతులు ఉడికాక దింపేసి చిల్లుల గిన్నెలోకి తీసుకొని పైన వెంటనే చన్నీళ్ళు పోసేయాలి.
- Step 5
ఇలా చేస్తే సేమియా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది.
- Step 6
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి.అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు కూడా వేయించాలి.
- Step 7
నీళ్ళు పోయి తురుము పొడిపొడిగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న సేమియా, తగినంత ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.