- Step 1
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బాలి. కొత్తిమీర సన్నగా తరగాలి.
- Step 2
నువ్వులు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కలపాలి.
- Step 3
తరువాత తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి.
- Step 4
ఇప్పుడు పిండి ముద్దను చపాతీ కర్రతో పాలిథీన్ కవర్ మీద గానీ లేదా నున్నని పాలరాయి మీద గానీ నూనె లేదా నెయ్యి అద్దుతూ చపాతీలా చేయాలి.
- Step 5
రొట్టె చేసాక గారే మాదిరిగా మద్యలో రంద్రం చేసి పైన నువ్వులు చల్లి నెమ్మదిగా అద్దాలి.
- Step 6
ఇప్పుడు పెనం మీద ఈ రొట్టె వేసి చిల్లులో అరటీస్పూన్ నూనె వేసి మూతపెట్టాలి.
- Step 7
రెండు లేక మూడు నిమిషాల తర్వాత రొట్టెను తిప్పి మళ్లీ అదే మాదిరిగా మధ్యలో పావుటీస్పూన్ నూనె వేసి మూతపెట్టి కాలనివ్వాలి.
- Step 8
రెండోవైపు తిప్పిన తర్వాత నువ్వులు గోధుమ రంగులోకి మారగానే రొట్టె తీయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి.
- Step 9
ఇది చాలా రుచిగా ఉండడమే కాక మంచి పోషకాహారం కూడా.