- Step 1
ఫ్రెషర్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, ఇంగువ వేసి వేయించాలి.
- Step 2
అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
- Step 3
ఇప్పుడు మొక్కజొన్న గింజలు, ఇతర కూరగాయ ముక్కలన్నీ వేసి కాసేపు వేయించాలి.
- Step 4
తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఓట్లు వేసి కలిపి మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి. చివరగా నెయ్యి వేసి కలిపితే సరి.