- Step 1
పెరుగులో అల్లం తురుము, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి.
- Step 2
బ్రెడ్ చివరలు కట్ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరంతా పిండేయాలి.
- Step 3
ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి మధ్యలో రంధ్రం చేయాలి.
- Step 4
అప్పుడు చూడటానికి వడలా వస్తుంది. బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్ వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- Step 5
తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి.
- Step 6
ఐదు నిమిషాలలో తీసి పక్కన పెట్టి పైన చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి. కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయడమే.
- Step 7
చాలా సులువుగా తయారైపోతాయి ఈ వడలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.