- Step 1
ముందుగా మినప్పప్పులో బియ్యం కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి.
- Step 2
మరోవైపు క్యారెట్, బీన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత నానబెట్టిన మినప్పప్పును గ్రైండర్ లో వేసి రెండు నిముషాలు రుబ్బాలి.
- Step 4
తర్వాత పచ్చిమిరపకాయలను, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వడలకు కలిపే పిండిలా కలుపుకోవాలి.
- Step 5
రుబ్బిన పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను, పచ్చి బఠానీలను, డాల్డాను వేసి బాగా కలపాలి.
- Step 6
అనంతరం స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి.
- Step 7
నూనె బాగా కాగిన తర్వాత కూరగాయలు చేర్చిన మినప్పప్పు పిండిని వడలాగా తట్టి కాగుతున్న నూనెలో వేసి బాగా వేయించాలి.
- Step 8
ఇంకేముంది నోరూరించే వెజ్ వడలు రెడీ. వీటిని పచ్చి కొబ్బరి చట్నీతో గాని, ఎండు మిరపకాయ చట్నీతో గాని తినవచ్చు.