- Step 1
మొదట ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి రాగి పిండి తీసుకోవాలి.
- Step 3
అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, సెనగపప్పు, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు, (కావాలనుకుంటే కొంచెం మునుగాకు కూడా వేసుకోవచ్చు) తగినంత ఉప్పు, నీళ్ళు పోసి చపాతీ పిండిలా చేసుకోవాలి.
- Step 4
స్టవ్ మీద బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసుకొని, అది బాగా కాగాక రాగి పిండి మిశ్రమాన్ని వడలా చేతితో కావలసిన ఆకారంలో తట్టి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Step 5
అంతే నోరూరించే రాగి వడలు రెడీ. ఇవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యానికి చాలా మంచిది.