- Step 1
కాలీఫ్లవర్ పూరెమ్మలను దేనికది విడదీయాలి.
- Step 2
తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 3
ఆలోపు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేయాలి.
- Step 4
ముప్పావు కప్పు నీళ్ళల్లో పాలపోడ్ వేసి పేస్ట్ లా చేయాలి.
- Step 5
ఆ తర్వాత ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి.
- Step 6
తర్వాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి.
- Step 7
ఇప్పుడు పాలపొడి ముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకూ ఉడికించాలి.
- Step 8
ఇప్పుడు వేయించి తీసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి టీకప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరి చూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి.
- Step 9
గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టం అయితే పంచదార వేసి కలిపి దించాలి.