- Step 1
ముందుగా కొబ్బరి పొడి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర మూడింటిని కొద్దిగా నూనె పోసి ముద్దగా నూరుకోవాలి.
- Step 2
ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండిలో కప్పు నీరు పోసి నానపెట్టి పెట్టుకున్న శనగపప్పు, సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
- Step 3
కుక్కర్లో అయితే ఒకటి రెండు విజిల్స్ రాగానే దింపేసుకోవాలి.
- Step 4
ఆ నీరు ఒంపకుండా అందులోనే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు వేసి కూర ముద్దగా అయ్యేంత వరకు ఉడికించాలి.
- Step 5
ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
- Step 6
చివరగా ఇంగువ కూడా జతచేసి ఈ తిరగమోతను ఉడుకుతున్న సొరకాయ కూటుకు జతచేయాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, చల్లి దించేయాలి. ఇది చపాతీల్లోకి చాల రుచిగా ఉంటుంది.