- Step 1
ములగ ఆకు శుభ్రముగా కడిగి వడకట్టాలి.
- Step 2
ఫ్రెజర్ కుక్కర్ లో సగం నూనె వేడి చేసి అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్, ఒక పచ్చిమిరపకాయలను వేయాలి.
- Step 3
పప్పు కడిగి రెండు కప్పుల నీళ్ళలో ముందే నానబెట్టి ఉంచుకోవాలి. పప్పు వడకట్టి కలపాలి. రెండు మూడు నిముషాలు వేయించాలి.
- Step 4
బంగాళదుంప తురుము, ములగ ఆకులు, అల్లం వేసి రెండు కప్పుల వేడి నీరు కలుపుకోవాలి.
- Step 5
అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ స్టీం విడుదలయ్యాక రుచి కోసం నిమ్మకాయరసం కలపాలి.
- Step 6
మిగతా నూనె చిన్న ప్యాన్ లో వేడి చేసి తాలింపు గింజలన్నీ వేసి, చిటపటలాడక కరివేపాకు, ఇంగువ, మిగతా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి.
- Step 7
ఈ తాలింపుని కుర్మాలో కలపాలి. కలియబెట్టాలి. ఇది అన్నానికి, చపాతిలకి మంచి కాంబినేషన్.