- Step 1
ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- Step 2
వేడి అయ్యాక కొన్ని ఆవాలు వేసి చిటపటలాడక జీలకర్ర, తుంపిన ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- Step 3
తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి దోరగా వేయించుకోవాలి.
- Step 4
వేగిన ఉల్లిపాయలకు, గుమ్మడి ముక్కలు, టమోటా ముక్కలు, చిటికెడు పసుపు కలపాలి.
- Step 5
తగినంత ఉప్పు వేసి పదిహేను నిముషాలు సన్నని సెగపై ఉడకనిచ్చాక కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలపాలి.
- Step 6
ఇప్పుడు అరకప్పు నీరు పోసి ముక్కలు ఉడికే అంత వరకు సన్నని సెగపై ఉంచాలి. కూర దించుకున్నాక కొత్తిమీర చల్లి వడ్డించాలి.