- Step 1
కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. తరువాత వీటిని ఓ గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 2
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 3
ముప్పావు కప్పు నీళ్ళలో పాలపొడి వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 4
బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి మూడు నాలుగు నిముషాలు వేయించి తీయాలి.
- Step 5
తరువాత అందులోనే మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద, గరం మసాలా వేసి వేయించాలి.
- Step 6
ఇప్పుడు పాలముద్ద కూడా వేసి ఉడికించాలి. పాలపొడి ముద్ద పాలవిరుగుడులా అయ్యేవరకు ఉడికించాలి.
- Step 7
ఇప్పుడు వేయించి తీసిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి టీ కప్పు నీళ్ళు పోసి, ఉప్పు సరిచూసి సిమ్ లో 5 నిముషాలు ఉడికించాలి.
- Step 8
గ్రేవీ చిక్కగా అయ్యాక ఇష్టమైతే పంచదార వేసి కలిపి దించుకోవాలి.