- Step 1
ముందుగా చేమదుంపల్ని కుక్కర్ లో వేసి ఓ విజిల్ రానివ్వాలి.
- Step 2
తరువాత మంట తగ్గించి రెండు మూడు నిముషాలు ఉడికించి దించాలి.
- Step 3
గ్రేవీ కోసం ఓ బాణలిలో కొంచెం నూనె వేసి వేడి అయ్యాక టొమాటో ముక్కలు వేసి కప్పు నీళ్ళు పోయాలి.
- Step 4
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి,కారం, లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 5
టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించాలి.
- Step 6
తర్వాత స్టవ్ ఆపి పప్పు గుత్తితో మెదిపి తొక్కు తీసేసి నీటిని మాత్రం ఓ పాన్ లోకి వంపి స్టవ్ మీద పెట్టాలి.
- Step 7
వెన్న,ఉప్పు వేసి మరో రెండు నిముషాలు మరిగించాలి.
- Step 8
కసూరి మెంతి కూడా వేసి దించి ఈ గ్రేవీని ఓ పక్కకు ఉంచుకోవాలి. చేమదుంపల పొత్తు తీసి ముక్కలుగా కోయాలి.
- Step 9
ముక్కల మీద ఉప్పు, కారం చల్లాలి. తరువాత సెనగ పిండి చల్లి మొత్తం ముక్కలన్నింటికి అతుక్కునేలా వాటిని పైకి కిందికి కలపాలి.
- Step 10
మరో బాణలిలో నూనె (డీప్ ఫ్రీ కి సరిపడా ) వేసి సగం సగం చొప్పున వేయించి తీయాలి.
- Step 11
బాణలిలో కొద్దిగా నూనెను ఉంచి మిగతాది తీసేయాలి.
- Step 12
కొద్దిగా నూనె ఉన్న బాణలిలో వాము, ఉల్లి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- Step 13
తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి తీసిన చేమగడ్డల ముక్కలు వేసి, ఉప్పు, కారం సరిచూసి కొత్తిమీర చల్లాలి.