- Step 1
సొరకాయ ముక్కల్లో చాలా కొద్దిగా నీళ్ళు పోసి ఒక కూత వచ్చేవరకూ కుక్కర్ లో ఉడికించుకోవాలి.
- Step 2
ఆ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి తాలింపు గింజల్ని వేయించుకోవాలి.
- Step 3
అందులోనే కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి, రెండు లేక మూడు నిముషాలు వేగనివ్వాలి.
- Step 4
వేయించుకున్న పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసుకోవాలి.
- Step 5
కూరముక్కలోని తడిపోయాక ఈ పొడిని వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే సరిపోతుంది.
- Step 6
ఇది అన్నంలోకే కాదు, రొట్టేల్లోకి కూడా చాలా బాగుంటుంది.