- Step 1
సొరకాయ చెక్కు తీసి తురుమి గట్టిగా పిండేస్తే అందులోని నీరు పోతుంది.
- Step 2
అందులో మొక్కజొన్న పిండి, బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు, చెంచ కారం, సగం కొత్తిమీర తరుగు వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా చేసుకొని అందులో వేసి ఎర్రగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి.
- Step 4
ఉల్లిపాయ, టొమాటోలను ముక్కల్లా కోసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని ఐదారు చెంచాల నూనెలో వేసి బాగా ఉడకనివ్వాలి.
- Step 6
కాసేపయ్యాక మిగిలిన కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, మరికొంచెం ఉప్పు, వెన్న వేసి బాగా కలపాలి.
- Step 7
ఒకవేళ గ్రేవీ మరీ గట్టిగా ఉందనుకుంటే కాసిని నీళ్ళు కలుపుకోవచ్చు.
- Step 8
ఐదారు నిమిషాలయ్యాక దీన్ని దింపేసి ముందుగా వేయించుకున్న ఉండాలని వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రైడ్ రైస్ లోకి, రొట్టేల్లోకి బాగుంటుంది.