- Step 1
మొదట క్యాప్సికం, ఉల్లిపాయలు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి.
- Step 2
బాణలిలో తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు వేసి నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్ ను విడివిడిగా వేయించుకోవాలి.
- Step 4
ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
- Step 5
బాణలిలో నూనె వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
- Step 6
తర్వాత క్యాప్సికం ముక్కలు, వేరుసెనగ పప్పులతో చేసిన మిశ్రమం చేర్చి బాగా చిక్కబడే వరకు నూనెలోనే మగ్గనివ్వాలి.
- Step 7
అనంతరం కారం పొడి, ధనియాల పొడి వేసి కలిపి కొంచెం నీళ్ళు చల్లి పది నిముషాలు ఉడికించాలి.
- Step 8
చివరగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను గ్రేవీలో వేసి రెండు నిముషాలు ఉడికించాలి.
- Step 9
అంతే ఘుమఘుమలాడే క్యాప్సికం పన్నీర్ కుర్మా రెడీ. దీనిని అన్నం లేదా చపాతితో ఆరగించవచ్చు.