- Step 1
మొదట శెనగపప్పును అరగంటపాటు నీటిలో నానబెట్టాలి.
- Step 2
మరో వైపు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
- Step 3
స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నూనె వేయాలి.
- Step 4
నూనె బాగా కాగిన తర్వాత పోపు గింజలు వేసి చిటపటలాడక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
- Step 5
అనంతరం టమోటా ముక్కలు వేసి కలుపుకొని, వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి వేసి కలిపి సన్నని మంట మీద రెండు నిముషాలు ఉడికించాలి.
- Step 6
ఈలోపు ఒక చిన్న పాత్రలో చింతపండు తీసుకొని, అందులో గ్లాస్ నీళ్ళు పోసి, పులుసు తీసుకొని బాణలిలో పోయాలి.
- Step 7
తర్వాత తగినంత ఉప్పు చేర్చి పెద్ద మంట మీద పది నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
- Step 8
మరో వైపు నానబెట్టిన శెనగపప్పు మిక్సీలో వేసి, అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పును చేర్చి, కాసిన్ని నీళ్ళు పోసి (ఉండలు వచ్చేటట్లుగా) రుబ్బుకోవాలి.
- Step 9
ఇప్పుడు శెనగ పిండి మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో ఉండలుగా చేసుకొని, బాణలిలో ఉడుకుతున్న పులుసులో వేయాలి.
- Step 10
చివరగా పచ్చి కొబ్బరిని రుబ్బి, పులుసులో కల్పి మరో ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 11
అంతే పుల్లపుల్లటి శెనగపప్పు ఉండల పులుసు రెడీ. ఇది అన్నం, దోసె, ఇడ్లిలో సైడ్ డిష్ గా ఆరగించవచ్చు.