- Step 1
పన్నీర్ ను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. బేబీ కార్న్ ను గుండ్రముగా తరగాలి.
- Step 2
స్టవ్ మీద బాణలి ఉంచి మూడు టీస్పూన్ల నూనె వేసుకొని, కాగాక ముందుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.
- Step 3
వేరే బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగుని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి.
- Step 4
తర్వాత గరం మసాలా, అజినమెటో, ఉప్పు వేసి కలపాలి.
- Step 5
తర్వాత జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి.