- Step 1
ముందుగా పన్నీర్, ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, తర్బూజ గింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 4
తర్వాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
- Step 5
కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి 5 నిముషాలు ఉడికించాలి.
- Step 6
ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి రెండు లేక మూడు నిముషాలు ఉడికించి దించే ముందు కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా మిరియాలు, ఎండు మిర్చి, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించి, క్యాప్సికం, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.