- Step 1
ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి డ్రై ఫ్రూట్స్ గ్రేవీ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 2
అదే బాణలిలో నూనె పోసి కాగాక, షాజీరా, ఎండు మిర్చి, ఉల్లితరుగు వేసి దోరగా వేయించాలి.
- Step 3
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- Step 4
టొమాటో తరుగు, మిగిలిన పదార్థాలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
- Step 5
నూనె పైకి తేలుతున్నపుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి.
- Step 6
బాగా వేగిన తర్వాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 7
కడాయిలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.