- Step 1
పప్పులన్నిటినీ శుభ్రంగా కడిగి లోతైన గిన్నెలో వేసి ఆరు కప్పుల నీళ్లు, కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
- Step 2
పప్పులు అడుగంటకుండా, ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ పావుగంటసేపు ఉడికించాలి.
- Step 3
ఈ లోగా తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. పెద్ద గిన్నెలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు ఆ వరసలో వేసి కొన్ని నిమిషాలు వేగాక టొమాటో ముక్కలు వేయాలి.
- Step 4
కొద్దిగా బ్రౌన్ రంగుకి వచ్చాక ఉప్పు, పసుపు, కారం వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి.
- Step 5
తర్వాత పప్పు మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కదపాలి. పైన కొత్తిమీర చల్లి అలంకరించాలి. వేడివేడిగా తింటే బాగుంటుంది.