- Step 1
రాజ్మా గింజల్ని రాత్రంతా నీళ్లలో నానపెట్టాలి.
- Step 2
రాజ్మా, కందిపప్పుల్ని కలిపి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కుక్కర్‌లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- Step 3
ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి మళ్లీ పావుగంట సేపు ఉడికించి అందులో పెరుగు కలపాలి.
- Step 4
లోతైన గిన్నెలో బటర్ వేసి, కాగాక జీలకర్ర వేయాలి. అది వేగాక అల్లం, వెల్లుల్లి వేసి కొన్ని సెకన్ల తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేగించాలి.
- Step 5
తరువాత టొమాటో ముక్కలు వేసి కలిపి ఉప్పు, మసాలా దినుసులు వేయాలి.
- Step 6
ఇందులో ఉడికించిన పప్పుల్ని వేసి మంట మరీ ఎక్కువ, తక్కువ కాకుండా కొద్దిసేపు ఉడికించాలి.
- Step 7
తరువాత స్టవ్ ఆపేసి పైన కొత్తిమీర తరుగుని వేసి ఆపైన మీగడ వేయాలి. దీన్ని వేడివేడి లచ్చా పరాటా, నాన్ లేదా అన్నంతో తింటే బాగుంటుంది.