- Step 1
ఓ గిన్నెలో కాసిని నీళ్లు పోసి పనీర్ ముక్కలు, కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 2
బఠాణీలు కూడా ఉడికించి ఉంచాలి.
- Step 3
బాణలిలో కొద్దిగా నూనెవేసి అల్లం తురుము, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి చేయించాలి.
- Step 4
విడిగా మరో బాణలిలో నూనెవేసి కాగాక జీలకర్ర, పసుపు, ధనియాలపొడి వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగానే వేయించిన చింతపండు, టమాటా గుజ్జు మిశ్రమం వేసి కలపాలి. తరువాత క్రీమ్, చక్కెర, ఉప్పువేసి కలిపి సన్నని మంట మీద వేగనివ్వాలి.
- Step 5
తరువాత ఉడికించిన పనీర్‌ముక్కలు, బఠాణీలు వేసి కలిపి కాసేపు ఉడికించాలి.
- Step 6
అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న వేసి దించాలి.