- Step 1
బంగాళాదుంపల పొట్టు తీసి పొడవైన ముక్కలుగా కోసుకోవాలి.
- Step 2
శెనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వాము, దానిమ్మ గింజల పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, బేకింగ్ సోడా, అర టీస్పూన్ నెయ్యిలను ఒక గిన్నెలో వేసుకోవాలి.
- Step 3
నెమ్మది నెమ్మదిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలుపుకోవాలి.
- Step 4
ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని వేసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- Step 5
పెద్ద గిన్నెలో వేగించడానికి సరిపడా నూనె పోసి నానిన బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేగించాలి.
- Step 6
నూనె పీల్చుకునే పేపర్ మీద వాటిని వేయాలి.
- Step 7
ఆ తరువాత మిగిలిన నెయ్యిని ఒక నాన్‌స్టిక్ పాన్‌లో వేసుకుని అందులో ఉల్లిపాయ తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు వేగించాలి.
- Step 8
తరువాత పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసి కలిపి పాన్ మీద మూతపెట్టి ఏడు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించాలి.
- Step 9
గ్రేవీ చిక్క బడిన తరువాత వేగించిన బంగాళాదుంప ముక్కల్ని వేసి కలియపెట్టాలి. మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి అలంకరించాలి.