- Step 1
పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు... వీటిని విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- Step 2
మునగాకును శుభ్రం చేసి బాగా కడగాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- Step 3
ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
- Step 4
గరంమసాలా పొడి, మునగాకులు, పసుపు, వేసి వేయించాలి.
- Step 5
ఉప్పు, కొద్దిగా నీరు చిలకరించి, రెండు నిముషాలు ఉంచాలి. చివరగా పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు, ధనియాల... పొడులు వేసి బాగా కలిపి దించేయాలి.