- Step 1
ముందుగా పాలకూరను శుభ్రంచేసి కడిగి, ముక్కలుగా చేసుకోవాలి.
- Step 2
ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి ఉడకబెట్టాలి.
- Step 3
ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో నూనె వేసి పనీర్ ముక్కలను కాస్త వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
- Step 5
ఇప్పుడు మరికొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించాలి.
- Step 6
పసుపు, కారం, అల్లంవెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఇందులో రుబ్బిన పాలక్ మిశ్రమం, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలపాలి.
- Step 7
ఇప్పుడు పనీర్ ముక్కలను వేసి సన్నటి మంటపై ఉంచాలి. కూర గట్టిపడేవరకు ఉంచి స్టౌవ్ పై నుంచి దించేయాలి. చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.