- Step 1
ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు మరిగించి సోయా చంక్స్ వేసి దింపేయాలి.
- Step 2
చల్లారిన తర్వాత జల్లెట్లో వేసి నీరంతా గట్టిగా పిండేయాలి. మునగకాయలు రెండు అంగుళాల సైజులో కట్ చేసుకుని పైన నార తీసేయాలి.
- Step 3
పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 4
ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దవేసి కొద్దిగా వేపి కారం పొడి, ధనియాల పొడి, సోయా చంక్స్ వేసి మరో నాలుగు నిమిషాలు వేయించాలి.
- Step 5
ఇందులో మునగకాయ ముక్కలు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన టమాటాలు లేదా టమాటా ప్యూరీ (ముద్ద) వేసి కలిపి మూతపెట్టాలి.
- Step 6
కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. ముక్కలు ఉడికి నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి.