- Step 1
క్యారెట్, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి.
- Step 2
ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి. ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనపకాయలను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి.
- Step 4
దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి.
- Step 5
ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి.
- Step 6
వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.