- Step 1
శనగపప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి.
- Step 2
చుక్కకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 3
ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అవసరమైతే అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి.
- Step 4
ఇందులో కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తడిపోయేవరకు వేపాలి.
- Step 5
తర్వాత చుక్కకూర తరుగు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
- Step 6
చుక్కకూర మెత్తబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని గరం మసాలా పొడి కూడా వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 7
పప్పు, చుక్కకూర పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.