- Step 1
కాప్సికం, బంగాళాదుంపల్ని ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
పెనం వేడిచేసి ధనియాలు, గసగసాలు దోరగా వేయించుకోవాలి.
- Step 3
కొబ్బరి పొడి, వేయించిన ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, టమాటాముక్కలు, పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బంగార రంగు వచ్చేవరకు వేయించుకుని పసుపు, అల్లం,వెల్లుల్లి ముద్దవేసి మరి కొద్దిగా వేయించాలి.
- Step 5
ఇందులో బంగాళా దుంపల ముక్కలు, కాప్సికం ముక్కలు, కారం పొడి, ఉప్పువేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.
- Step 6
ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత తయారుచేసుకున్న మసాలాముద్దను, కప్పుడు నీళ్లుపోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.
- Step 7
కూర ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఈ కూర పులావ్, రోటీ, నాన్, పరాఠాలకు బావుంటుంది.