- Step 1
ముందుగా పన్నీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- Step 2
తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేసి అందులో కాస్త ఉప్పు వేసి కలపాలి.
- Step 3
పన్నీర్ ముక్కలను ఆ పిండిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో నూనెపోసి కాగాక ముందుగా పిండిలో దొర్లించుకున్న పన్నీర్ ముక్కలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
తరువాత అదే బాణలిలో ఉన్న నూనెలో టమాట గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్రపొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి.
- Step 6
తరువాత పన్నీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. అంతే మెంతి ఆకులతో పన్నీర్ కర్రీ రెడీ.