- Step 1
సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.
- Step 2
ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను.
- Step 3
బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి.
- Step 4
అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని చేర్చాలి.
- Step 5
పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి.
- Step 6
ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి.
- Step 7
గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు ముక్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా చల్లి మూడు నిమిషాలయ్యాక దించేస్తే సరిపోతుంది. కమ్మని నోరూరించే గ్రేవి రెడీ...