- Step 1
మీల్‌మేకర్‌ని వేడి నీళ్లలో వేసి పదినిమిషాలపాటు ఉంచాలి.
- Step 2
తర్వాత నీరంతా పిండేసి పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక మీల్‌మేకర్ వేసి కొద్దిగా వేయించాలి.
- Step 3
దీనివల్ల మీల్‌మేకర్‌కు మంచి వాసన వస్తుంది. పాలకూర కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఒక గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 5
తర్వాత పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేయించి తరిగిన పాలకూర, ఉప్పు, కారం పొడి వేసి కలిపి మూతపెట్టాలి.
- Step 6
చిన్నమంట మీద పాలకూర మొత్తం ఉడికేవరకు ఉంచి వేయించుకున్న మీల్ మేకర్, గరం మసాలా పొడి వేసి బాగా కలియబెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ కూర అన్నం, రొట్టెల్లోకి బాగుంటుంది.