- Step 1
పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి.
- Step 2
ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి.
- Step 4
దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
- Step 5
ధనియాల పొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు,ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి.
- Step 6
ఇందులో పెరుగు పోసి ఒక నిమిషం పాటు కలపాలి.
- Step 7
తర్వాత మీగడ , తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడక బెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి.
- Step 8
ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాల పొడి వేసి కొత్తిమీరతో అలంకరించాలి. మటర్ పనీర్ రెడీ. అన్నంతో, చపాతితో తింటే చాలా రుచిగా ఉంటుంది.