- Step 1
కడాయిలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, మెంతులు వేయించాలి.
- Step 2
వీటిని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టాలి. మళ్లీ కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డలు, అల్లం వేసి వేయించాలి.
- Step 3
కొద్దిగా వేగాక టమాటాలను వేసి కలపాలి. టమాటాలు బాగా ఉడకనివ్వాలి.
- Step 4
దీన్ని కాసేపు చల్లారనిచ్చి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె పోసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగనివ్వాలి.
- Step 6
దాంట్లో టమాటాప్యూరీ వేసి కలపాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి.
- Step 7
ఆ తర్వాత గరం మాసాలా పౌడర్, కారం, ధనియాల పొడి పసుపు వేసి కలపాలి.
- Step 8
రెండు నిమిషాలాగి బఠాణీలు వేసి రెండు కప్పుల నీళ్ళుపోయాలి.
- Step 9
దీంట్లో ధనియాలపొడి, చక్కెర, ఉప్పు వేసి కలపాలి. పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే గ్రీన్ పీస్ మసాలా రెడీ!