- Step 1
బేబీకార్న్ కండెల్ని పొడవుగా చీల్చాలి. రెండు కూతలు వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి.
- Step 2
తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడెక్కాక దానిలో ఉల్లి,పచ్చిమిర్చి. టమాటా తరుగు వేసి మగ్గించాలి.
- Step 4
తర్వాత ఉడికించిన కార్న్ ముక్కలు పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి.
- Step 5
5నిమిషాల తరువాత దానిలో కప్పునీరు, పావుకప్పు పెరుగు వేయాలి. ఈలోగా మొక్కజొన్న పిండికి రెండు చెంచాల నీళ్లు కలపాలి.
- Step 6
దానిని కూడా బాణలిలో వేయాలి. కొద్దిసేపు ఉడికేటప్పటికి గ్రేవీ తయా రవుతుంది. దించే ముందు కొత్తిమీర ముక్కలు చేసి జల్లాలి.
- Step 7
ఇక మొక్కజొన్న కుర్మా సిద్ధమైనట్లే.