- Step 1
గోదుమ రవ్వను ఓ గంట పాటు నీటిలో నానబెట్టండి. తరువాత నీరు ఒంపి నాలుగు కప్పుల మంచినీరు పోయండి.
- Step 2
పప్పులన్నీ వేసి కుక్కర్లో అర గంట ఉడికించండి.
- Step 3
వేడినీటిలో సోయా గింజలను 20 నిమిషాలు నానబెట్టాలి. నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు గిన్నెలో ఆయిల్ పోసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసి కలపాలి.
- Step 5
రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసి కలయబెట్టాలి.
- Step 6
ఇప్పుడు కారం, దనియాల పొడి, పచ్చి బఠానీలు వేయాలి.
- Step 7
ఇప్పుడు ముందు ఉడికించి పెట్టుకున్న గోదుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని కలపాలి.
- Step 8
దీనిలో సోయా గింజలను వేయాలి. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. రుచికి సరిపోయేంత ఉప్పు కలిపి 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి. ఇక వేడి వేడి వెజిటబుల్ హలీమ్ రెడీ...