- Step 1
పెసరపప్పు కడిగి నీళ్లుపోసి గంటసేపు నాననివ్వాలి. బీరకాయ చెక్కు తీసి చేదు చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- Step 3
ఇందులో కరివేపాకు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేపాక నానిన పెసరపప్పు వేయాలి.
- Step 4
బాగా కలిపి నీరంతా పోయేవరకు వేయించాలి. తర్వాత బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 5
చిన్న మంటమీద ముక్కలు మగ్గిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. చివరగా గరం మసాలా పొడి కలిపి దింపేయాలి.
- Step 6
ఈ కూర చపాతీ, అన్నంలోకి బావుంటుంది. కూరగాయలు అ చ్చంగా అలాగే కాకుండా అప్పుడప్పుడు పప్పులు కూడా కలిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
\